తెలంగాణలో ఏపీ మంత్రుల ప్రచారం
తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమైన టీడీపీ నేతలను ప్రచారానికి పంపించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సమాంధ్ర ఓటర్లను టీఆర్ఎస్కు అనుకూలంగా మార్చడానికి వైసీపీ, జనసేన నేతలు చాపకింద నీరులా ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో వాటి ప్రభావం ఉందనుకొనే చోట్ల కొందరు ఆంధ్రప్రదేశ్ నేతలను టీడీపీ ప్రచారానికి పంపించింది. పరిటాల సునీత కూకట్పల్లిలో నందమూరి సుహాసిని తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు కూడా ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.













