ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై… సుప్రీంకోర్టులో మళ్లీ

మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే, కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మార్చి 13న చూస్తామని ధర్మాసనం తెలిపింది. కాగా, మద్యం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సవాల్ చేశారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన విషయం తెలిసిందే. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు గత విచారణలో జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం సృష్టం చేసింది. 3 కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని ధర్మాసనం అబిప్రాయపడింది.