ఈటలను ఆహ్వానించిన… వైఎస్ షర్మిల

మాజీ మంత్రి ఈటల రాజేందర్‍ను వైఎస్ షర్మిల తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్‍లో సమావేశమైన ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అన్నారు. టీఆర్‍ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని, కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు. తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో ఎటువంటి చర్చ లేదని చెప్పారు.