బీజేపీకి వేసే ప్రతి ఓటుతో.. బీఆర్ఎస్ కు లాభం… రేవంత్
బీజేపీకి వేసే ప్రతి ఓటుతో బీఆర్ఎస్కు లాభం కలుగుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రస్ విజయభేరి సభలో రేవంత్ మాట్లాడుతూ ఓట్లు చీలికతో బీఆర్ఎస్కు ప్రయోజనం కల్పించడమే బీజేపీ ఉద్దేశమని విమర్శించారు. సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి కట్టింది కాంగ్రెస్ హయాంలోనే. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను కేసీఆర్ మోసం చేశారు. గతంలో ఆయన్ను ఎంపీగా పాలమూరు నుంచి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని విస్మరించారు. హైదరాబాద్-శ్రీశైలం హైవే వేసింది కాంగ్రెస్. సంగారెడ్డికి అధిక పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చాం అన్నారు.
బీజేపీకి వేసే ప్రతి ఓటూ మురిగిపోయినట్లే. ఈ ఎన్నికల్లో ఓట్లు చీలడానికి వీల్లేదు. బీజేపీ, బీఆర్ఎస్లో ఎవరి పట్ల కనికరం చూపినా నష్టం తప్పదు. ఎన్నికల వేళ రైతుబంధు వేస్తామని బీఆర్ఎస్ ఈసీ నుంచి అనుమతి తెచ్చుకుంది. బీఆర్ఎస్-బీజేపీ కలిసే రైతుబంధు నగదును విడుదలకు అనుమతి తెచ్చుకున్నాయి. దళితబంధు, మైనార్టీబంధు, బీసీ బంధుకు ఈసీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదు? ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీలు, దళితులు, మైనార్టీలను మోసం చేశాయి అని విమర్శించారు.













