టీఆర్ఎస్ లో ఆయనకు కాలం చెల్లినట్టే
టీఆర్ఎస్ పార్టీలో హరీష్‌రావుకు కాలం చెల్లినట్లేనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఓ కేసు సంబంధించి సిద్దిపేట కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నమ్మినవాళ్లను నట్టేటముంచడం కేసీఆర్‌కు అలవాటేనన్నారు. హరీశ్‌కు సిద్దిపేట ఈసారే ఆఖరని, మరోసారి టికెట్ రాదన్నారు. 16 మంది ఎంపీలుంటే ఏదో వెలగబెడతామంటున్నారని, ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చారా? విభజన హామీలు సాధించారా? అని ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీగానే కొనసాగుతాయని అన్నారు.













