తెలంగాణ భేష్!
తెలంగాణలో కరోనా నియంత్రణ ఎలా జరుగుతుందో పరిశీలించడానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం తన నివేదికను అందజేసింది. కరోనా నియంత్రణకు రాష్ట్రం అవలంభిస్తున్న వ్యూహంపై కేంద్ర బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో ప్రధాన అంశాలను ఇవ్వాళ కేంద్రం తన రోజువారీ మీడియా సమావేశంలో వెల్లడి చేసింది. తెలంగాణలో సరిపోయినన్ని పి.పి.ఈ.లు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేషెంట్ కు సంబంధించిన సమస్త సమాచారం – టెస్టింగ్ నుండి డిస్చార్జి వరకు పర్యవేక్షించే ఐటీ డాష్‌బోర్డు కలిగి ఉంది.
కరోనా వ్యాధి చికిత్సకు రాష్ట్ర నోడల్ హాస్పిటల్ అయిన గాంధీ ని సందర్షించిన బృందం అక్కడ ట్రీట్మెంట్, డిస్చార్జి ప్రొటోకాల్స్ పై సంతృప్తి వ్యక్తం చేసింది. డిస్చార్జి అయిన రోగులను ఇంటివద్దకు దిగబెడుతున్నారని, క్వారంటైన్లో ఉన్న వారిని సైతం నిత్యం మొబైల్ ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నరని కేంద్ర బృందం అన్నది. హుమాయున్ నగర్లో ఒక కంటెయిన్మెంట్ జోన్ సందర్శించిన కేంద్ర బృందం అక్కడ అధికారులు ఇండ్ల వద్దకే నిత్యావసర వస్తువులు సమకూర్చుతున్నారని పేర్కొంది. పౌరులు బయటికి రాకుండా డ్రోన్ సాయంతో పోలీసులు పహారాకాస్తున్నారు అని కేంద్ర బృందం అన్నది రాష్ట్రంలోని 44 ఆసుపత్రులకు కావలసిన మందులు సరఫరా చేసే హైదరాబాదులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో మానిటరింగ్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా అన్నార్తులకు భోజనం ఉచితంగా అందజేయడం గురించి కేంద్ర బృందం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కోడి గుడ్డు మీద ఈకలు పీకే యాక్సిడెంటల్ ఎంపీల బ్యాచ్ ఇప్పటికన్నా అర్థంచేసుకుంటరా?













