Medaram : మేడారం మహాజాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఆహ్వానం
వచ్చే నెలలో జరిగే మేడారం మహాజాతర (Medaram Maha Jatara)కు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క (Sitakka), కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆహ్వానించారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆమెను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఆమెకు సమ్మక్క తల్లి చీర, కంకణం, కండువా, బంగారాన్ని అందజేశారు. మేడారం మహాజాతర విశేషాలను సమ్మక్క, సారలమ్మ తల్లుల వీరగాథలను ఆమెకు తెలిపారు. జాతరకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆమె నూతన వస్త్రాలను బహూకరించారు.






