కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన… ఎమ్మెల్యేలతో కూడా

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‍ఎస్‍లో చేరిన ఎమ్మెల్యేలతో కూడా సీఎం కేసీఆర్ రాజీనామా చేయించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మారుతున్న సందర్భంగా నైతిన బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. కేసీఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిడపడ్డారు. కరోనా, లాక్‍డౌన్‍తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.