వారు పాస్‍పోర్టు, వీసా చూపించి… తొలిడోసు తీసుకోవచ్చు

తెలంగాణ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వారు పాస్‍పోర్టు, వీసా చూపించి తొలిడోసు తీసుకోవచ్చు అని తెలిపింది. విదేశాలకు వెళ్లేవారికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 28 రోజుల తర్వాత రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ, రెండో డోసు వేసేటప్పుడు మాత్రం పాస్‍పోర్టు, వీసాలను కొవిన్ పోర్టల్‍లో అప్‍లోడ్ చేయాలని తెలిపింది.