ఆయన చస్తే రైతుబీమా కింద.. రూ. 5 లక్షలు : పల్లా
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చావాలని కోరుకోవడం లేదు, కానీ ఆయన చస్తే రైతుబీమా కింద రూ. 5 లక్షలు ఇప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లా మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఢల్లీిలో చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైందని స్పష్టం చేశారు. తమ ధర్నా తర్వాత ఎఫ్సీఐ అధికారి తెలుగు మీడియాతో మాట్లాడారు. బీజేపీ ధర్నాలో బండి సంజయ్ పిచ్చికుక్కలా మాట్లాడారని మండిపడ్డారు. సంజయ్ వార్డ్ మెంబర్ స్థాయి కన్నా తక్కువగా దిగజారి మాట్లాడారని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ ఎలా జరుగుతుందో కూడా బండికి కనీస అవగాహన లేదన్నారు. తనపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తావా, దమ్ముంటే చేయించాలని బండి సంజయ్కు సవాల్ పల్లా సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు ఒక్కటి అంటే తాము రెండు అంటామని తేల్చి చెప్పారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.













