తెలంగాణలో కొత్తగా 3,762 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,762 మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,63,903 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా 3,816 మంది కోలుకోగా మొత్తం 5,22,082 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజాగా మరో 20 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,189 చేరింది. జీహెచ్‍ఎంసీ పరిధిలో 528 మంది, మేడ్చల్ -మల్కాజ్‍గిరిలో 213 మంది, ఖమ్మంలో 214 మంది, రంగారెడ్డిలో 229 మంది, నల్గొండ 218 మంది కరోనా బారినపడ్డారు.