దుబ్బాక విజయంపై మోదీ, అమిత్ షా అభినందన
దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం అభినందనలు తెలిపింది. ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం సాధించేందుకు కృషి చేసినందుకు పార్టీ కార్యకర్తలకు అభినందనలు చెప్పారు. ఈ విజయం సాధించేందుకు కృషి చేసినందుకు పార్టీ కార్యకర్తలకు అభినందనలు చెప్పారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని సూచించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కూడా ట్విట్టర్లో తెలుగులో అభినందించారు. పార్టీ విజయానికి కృషి చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.













