మేడారం జాతరకు రండి.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
దక్షిణ భారతదేశ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రులు సత్యవతి రాథోడ్, అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, జాతర ధర్మకర్తల మండలి చైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, బడే నాగజ్యోతి, దుర్గం రమణయ్య ఆహ్వానించారు. ప్రగగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి కోటీ మందికి పైగా భక్తులు తరలిరానున్నారు.













