మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు…
కరీంనగర్ ఎంపీగా నాలుగేళ్లలో ఏం పీకినవని నిలదీయాలని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాన్వాయ్కి అడ్డుగా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుగా వచ్చి నినాదాలు చేశారు. ఈ విషయంలో ఆత్మీయ సభలో ఏబీవీపీ కార్యకర్తలనుద్దేశించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడి సిరిసిల్ల ఎక్కడికి వచ్చింది? విద్యావ్యవస్థలో ఇలా అవుతుందని ఎవరైనా అనుకున్నారా? సిరిసిల్ల మెడికల్ కాలేజీప్రారంభమవుతుందని అనుకున్నామా? అని ప్రశ్నించారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చిన కేసీఆర్ ఎక్కడా? తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని దౌర్భాగ్యపు ప్రధాని ఎక్కడ? ఆయనతో మనకు పోలికనా అని అన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, నవోదయ పాఠశాల, కస్తూర్బా ఇవ్వలే. పోయినసారి కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ వచ్చినట్టే వచ్చి ఎత్తిపోయింది. విద్యార్థులు ఎవరిపై కొట్లాడాలి? మనం ఏం చేస్తున్నామో కొద్దిగా సోయి ఉండాలి. ఇన్ని చేసిన ప్రభుత్వంపైకి వ్యవసాయ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ పెట్టి బ్రహ్మాండంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలు తెస్తే నలుగురు పిల్లలను ఉసిగొల్పి అడ్డం పంపడం న్యాయమా? ఇది సరైందేనా? విద్యావవస్థలో ఎక్కడ వెళ్లిందో ఆలోచన చేయొద్దా? వట్టిగనే ఆగమైపోదామా? దుమ్ముంటే నరేంద్ర మోదీ, బండి సంజయ్‌పై దాడి చేయాలి అన్నారు.













