తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్
తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తనతో పాటు మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ వేతనాలలో కోత కోనసాగుతుందన్నారు. ఆదివారం మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకర్లతో మాట్లాడారు. మే 7 వరకు ఎవరూ విమానాల ద్వారా హైదరాబాద్కు రావొద్దని కోరారు. ఆన్లైన్లో కూరగాయల సరఫరా అనుమతిస్తామని తెలిపారు. స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆహార సరఫరాను నిషేధిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో వచ్చే ఏడాదికి ఫీజు ఒక్క రూపాయి కూడా పెంచకూడదని సృష్టం చేశారు. మరో వైపు కరోనాతో రెండు నెలల బాబు హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. రాష్ట్రంలో ఆదివారం 49 కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 858కు పెరిగింది.














