కేసీఆర్ సేవా పురస్కారం అందుకున్న కృష్ణమోహన్
దశాబ్దాలుగా బీసీల హక్కులు, ప్రయోజనాల కోసం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తున్న వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఉత్తమ సామాజిక సేవకుడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. కేసీఆర్ సేవా పురస్కారం అందుకోవడానికి ఆయన పూర్తి అర్హుడని, తన చేతుల మీదుగా పురస్కారం అందించడం చాలా సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. కేసీఆర్ సేవా మండలి ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన తొలి పురస్కారాన్ని కృష్ణమోహన్‌కు ప్రకటించారు. కవిత నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి, చైతన్యం కోసం వకుళాభరణం కృషి అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, కేసీఆర్ సేవా మండలి అధ్యక్షుడు అంకెపల్లి మల్లికార్జునరావు, డాక్టర్ హరిచరణ్, రాఘవ పాల్గొన్నారు.













