ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు. రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాలకు స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నేడు ఈసీకి స్పీకర్ కార్యాలయం సమచారం ఇవ్వనుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. అదే రోజు కోమటిరెడ్డిని మునుగోడు అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుంది.













