తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టం చేశారు. 30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యావరణంపై చర్చ సందర్భంగా మానవాళికి, జీవనకోటికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి అవసరమైన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రివర్గ భేటీలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని సృష్టం చేశారు. పారిశుద్ధ్యం నిర్వహణలో కేంద్ర నుంచి అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు. పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.













