స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. శ్రీనివాస్ అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని, ఈ క్రమంలోనే నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. కవిత ఏకగ్రీవంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ తరపున ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.













