రాజీనామాపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ
రాజీనామా అంటు వస్తున్న వార్తలు అవాస్తవమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. మీడియాకు ఎవరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. పీఏసీ మీటింగ్‌లో ఏం జరిగిందో నేను చెప్పను. పీఏసీ భేటీలో తన ఆవేదనని మణిక్యం ఠాగూర్‌కి చెప్పానని తెలిపారు. నాపై వస్తున్న వార్తల్లో ఏది నిజం. ఏది అబద్దమో నేను చెప్పను. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీని కలుస్తానని తెలిపారు. తన స్టాండ్ ఎప్పుడూ కాంగ్రేసేనని స్పష్టం చేశారు. తన వల్ల ఎవరికైనా ఇబ్బందైతే, ఇండిపెండెంట్‌గా ఉంటానని, ఏ పార్టీలోకి వెళ్లనని తెలిపారు. పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. నన్ను ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా కాంగ్రెస్‌ను వీడాలని నాకు లేదన్నారు.













