ఈ నెల 21న భవిష్యత్ కార్యాచరణ : జగ్గారెడ్డి
బయటవారికంటే తమ పార్టీ వారే అనవసర ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ నాయకత్వంలో మార్చి 21న లక్ష మందితో సభ నిర్వహిస్తానని అన్నారు. ఆ సభలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. హైకమాండ్‌ను కలిసే వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక వేళ టీఆర్ఎస్లోకి వెళ్తానంటే అడ్డుకునే వారు లేరని అన్నారు. వ్యక్తిగత రాజకీయం కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టనని తెలిపారు.













