విదేశీ విద్యకు భారతీయుల ఆసక్తి
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారని స్టడీ గ్రూప్ సీఈవో ఇయాన్ క్రిచ్టన్ అన్నారు. వివిధ దేశాల్లోని కాలేజీల్లో ఏటా పెరుగుతున్న భారతీయ విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఇందుకు నిదర్శనమని తెలిపారు. అంతర్జాతీయ విద్య ద్వారా ఆధారితమైన, స్థిరమైన ప్రపంచ అభివృద్ధి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇయాన్ క్రిచ్టన్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రధాన కార్యాలయ సంస్థ భారతీయ విద్యార్థుల నమోదులో 2020`22లో వంద శాతం పెరుగుదలను నమోదు చేసుకుందని తెలిపారు. గతేడాది 1.09 మిలియన్ల మంది 85 దేశాల్లో చదువుకునేందుకు వెళ్లారన్నారు. స్టడీ గ్రూప్ రీజనల్ డైరెక్టర్ కరణ్ లలిత్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థులు ఇటీవల యూకేలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో అతిపెద్ద సమూహమైన చైనా జాతీయులను అధిగమించడం సంతోషకరమన్నారు.













