మా బద్ధకానికి కారణం హైదరాబాద్ బిర్యానీయే : పాకిస్థాన్ వైస్ కెప్టెన్
వన్డే ప్రపంచ కప్ కోసం ఏడేళ్ల తర్వాత భారత్లో అడుగు పెట్టిన పాకిస్థాన్ క్రికెటర్ లకు హైదరాబాద్లో అద్భుత ఆతిథ్యం లభిస్తోంది. నగరంలో అగ్ర హోటళ్లలో ఒకటైన పార్క్ హయత్ లో పాక్ క్రికెటర్లకు బస ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ పాక్ ఆటగాళ్లకు మరింత నచ్చింది పాకిస్తాన్ ఆడిన రెండు వార్మప్ మ్యాచ్ లోనూ హైదరాబాద్ బిర్యానీయే తమ కొంప ముంచిందని ఆ జట్టు వైస్ కెప్టెన్ షదాబ్ ఖాన్ అన్నాడు. వరల్డ్ కప్ కోసం భారత్ కు వచ్చిన పాకిస్తాన్ జట్టు తమ రెండు వార్మప్ మ్యాచ్ లను హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలోనే ఆడి, ఓడిపోయింది. బిరియానీ అధికంగా తినడంతో మైదానంలో తాము అంత చరుగ్గా ఉండలేకపోతున్నామని తెలిపాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెటర్లు పలు క్యాచ్ లను వదిలేయడంతో పాటు మిస్ ఫీల్డ్ చేశారు. ఈ రెండు మ్యాచ్ లోనూ పాక్ ఓటమి పొందింది. తమ జట్టు రెండు వరుస ఓటములకు హైదరాబాద్ బిరియాని కారణమంటూ షాదాబ్ పేర్కొన్నాడు..













