సన్ బర్న్ కార్యక్రమం రద్దు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి బుక్‌మై షోలో టికెట్లు విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకోకుండా టికెట్లు విక్రయించినందుకుగానూ బుక్ మై షో, నోడల్ అధికారులకు నోటీసులిచ్చారు. ప్రస్తుతం బుక్ మై షోలో సన్ బోర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ కనిపించడం లేదు. విశాఖ వేదికగా జరగబోయే సన్‌బర్న్ ఈవెంట్ టికెట్లు మాత్రం అమ్ముడుపోతున్నాయి.













