ప్రగతి నివేదన సభకు ఎన్నారైలు భారీగా రావాలి
టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన బహిరంగసభకు ఎన్నారైలు హాజరై మద్దతు తెలుపాలని తెలంగాణ గల్ఫ్ ఎన్నారై ఫౌండేషన్ ప్రతినిధులు యూసువుద్దీన్ అన్వర్, షంషోద్దీన్, అబ్బగోని శ్రీధర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో సైతం తెలంగాణ పథకాలు చర్చనీయాంశంగా మారుతున్నాయని, ఇది మాకెంతో గర్వకారణమన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ గల్ఫ్ ఫెడరేషన్ ప్రతినిధులు మీర్ ఆరీఫ్ అలీ, సయ్యద్ అజీజ్, ఎండీ అలీ నాయర్ పాల్గొన్నారు.













