కవిత రాజకీయ కార్యాచరణ ఎలా ఉండనుంది..?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుని తిహార్ జైల్లో ఐదునెలలకుపైగా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమెను బయటకు రప్పించేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలందరూ .. తమవంతుగా ప్రయత్నించారు. చివరకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె బయటకు వచ్చారు. అక్కడి వరకూ బానే ఉంది. కానీ.. ఆమె చేతులు బిగించి జైలు బయట శపథం చేశారు. తనను జైలుకు పంపి మరింత మొండిదాన్ని చేశారని.. అసలు, వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. దీంతో బయట ఉన్న నేతలు, క్యాడర్… జై కవిత అంటూ నినదించారు. అంతేకాదు కొందరు సీఎం కవిత అంటూ నినాదాలు సైతం చేశారు.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. బీఆర్ఎస్ లో కేటీఆర్,హరీశ్ రావు తప్ప మిగిలిన నేతలందరూ సైలెంటయ్యారు. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన సీఎం రేవంత్ రెడ్డి.. విపక్షాన్ని హడలెత్తిస్తున్నారు. దీంతో చాలా మంది నయానో,భయానో, ఇంకే ప్రలోభాలకు ఆశపడుతున్నారో కానీ… కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. అవి ప్రజల్లోకి పెద్దగా వెల్లడం లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ దగ్గర కాళేశ్వరం అవినీతి అనే బ్రహ్మాస్త్రం ఉంది. దీని కన్నా పెద్ద అవినీతి ఎక్కడుందని ఆపార్టీ గట్టిగానే ప్రశ్నిస్తోంది.
బిల్లా, రంగా అంటూ కేటీఆర్, హరీశ్ రావులను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. రైతు రుణమాఫీపై హరీశ్ రావు .. యాదాద్రి టెంపుల్ లో అపచార పూజ చేయగా.. దానిపై కేసు కూడా నమోదైంది. అంతేకాదు… బీఆర్ఎస్ .. బీజేపీలో విలీనమవుతుందని మాటిమాటికీ ప్రస్తావిస్తున్నారు. దీంతో నిజంగానా అన్న సందేహాలు…. గులాబీ పార్టీలోనే తలెత్తే స్థితికి చేర్చారు. ఈపరిస్థితుల్లో భీకర ప్రతిజ్ఞ చేసిన కవిత.. ఇప్పుడు ఏం చేయనున్నారు. ఆమె పోరాటం ఎలా ఉండనుంది.?
కవితతో కలిసి వచ్చేదెవరు..?
కవిత యాక్టివ్ గా ఫైట్ చేస్తారు. సరే ఎవరితో కలిసి పయనిస్తారు..? ఆమె రాజకీయంగా ,, ఏ పార్టీతో కలిసి ముెందుకెళతారు. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలకు.. బీఆర్ఎస్ అంటే ఏమిటో స్పష్టంగా తెలుసు. కేసీఆర్ పుణ్యమాని.. ఆపార్టీతో పొత్తంటేనే.. ఆమడ దూరంగా ఉంటున్నాయి. ఇక కాస్తో, కూస్తో జనాదరణ ఉన్న నేతలు కూడా.. అధికార పక్షానికి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. ఇక మిగిలింది.. కమ్యూనిస్టులు, చిన్న,చితక పార్టీలు. ఇందులోనూ కమ్యూనిస్టులో ఓపార్టీ.. అధికార పక్షంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు.