ఆహ్వానం అందితే వెళ్దామనుకున్నా… కానీ : తమిళిసై
హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ తీరాన భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అట్టహాసంగా సాగింది. అయితే ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ దూరంగా ఉన్నారు. ఈ పరిణామంపై తాజాగా ఆమె స్పందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనకు ఆహ్వానమే అందలేని గవర్నర్ అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం అందితే వెళ్దామనుకున్నా. అంబేద్కర్ మహిళల హక్కుల గురించే ఎక్కువ మాట్లాడేవారు. అయితే మహిళా గవర్నర్ అయినా నాకు ఆ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యం. అందుకే రాజ్‌భవన్‌లోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళులు అర్పించాను అని తమిళి సై తెలిపారు.













