తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. రేవంత్‌కు నిన్నటి నుంచి జ్వరంతో పాటు కరోనా స్వల్ప లక్షణాలున్నాయి. దీంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ తేలిందని రేవంత్ ట్వీట్ చేశారు. ఇటీవల తనతోపాటు సన్నిహితంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.