దేశంలోనే కాదు.. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలనలోనే
కాంగ్రెస్ పాలనలోనే దేశంలో అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలనలోనే అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని కేసీఆర్ గుర్తించాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే టీఆర్ఎస్ ఏం చేసేదని ప్రశ్నించారు. రెండేళ్లుగ రాష్ట్రంలో రుణమాఫీ ఊసే లేదని తెలిపారు. రుణమాఫీ లేక రైతులపై మరింత భారం పడుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.













