రూ.1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. రూ.లక్షా 82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను సీఎం ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.లక్షా 31,629 కోట్లు, ఆర్థికలోటు రూ.27,749 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు, ప్రగతి పద్దు రూ.లక్షా 7,302 కోట్లు, నిర్వహణ పద్దు రూ.74,715 కోట్లు.
బడ్జెట్ కేటాయింపులు :
రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు
మూలధన వ్యయం రూ.32,815 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు
ఆర్థిక లోటు రూ.27,749 కోట్లు (అంచనా)
2018-19 ఆర్థిక వృద్ధి రేటు 10.6 శాతం
కల్యాణలక్ష్మి, షాది ముబారక్ కోసం రూ.1,450 కోట్లు
రైతు రుణమాఫీకి రూ.6,000 కోట్లు
ఆసరా పింఛన్లకు రూ12,067 కోట్లు
మిషన్ కాకతీయకు రూ.22,500 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి రూ.2,004 కోట్లు
పీడీఎస్ బియ్యం సబ్సిడీకి రూ.2,744 కోట్లు
రైతు భీమాకు రూ.650 కోట్లు
నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు













