ఎన్టీఆర్ తర్వాత, వెంకయ్య నాయుడే : చిరంజీవి
ఎన్టీఆర్ తర్వాత తెలుగువారికి అంతటి గుర్తింపు తెచ్చింది వెంకయ్య నాయుడేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లో లాల్ బంగ్లాలో ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటుడు చిరంజీవితో కలిసి ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావడం తన కోరిక అని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యాన్ని అందరూ నెగ్టెల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్‌రాజ్‌కుమార్ ఫ్యామిలో కార్డియాక్ జీన్ ఉందని, అలాంటిది ముందే తెలుసుకుని ఉంటే ఇంత ఇబ్బంది ఆ కుటుంబానికి ఉండేది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేందర్రావు, మాజీ క్రికెట్ అజారుద్దీన్, పుల్లెంల గోపీచంద్, ద్రోణపల్లి హారిక, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, డయాగ్నోస్టిక్ వ్యవస్థాపకులు కంచ్లర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.













