సీఎం రేవంత్ ను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని యాదయ్య ప్రకటించారు.