ఎన్టీఆర్ భవన్లో చండీయాగం
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో భక్తిశద్ధ్రలతో దశ మహా విద్యాపూర్వక నవ చండీయాగం నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యాగానికి హాజరై పూజలు చేశారు. ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దంపతులు యాగంలో కూర్చుని క్రతువు నిర్వహించారు. మంచి ఉద్దేశంతో యాగం విజయవంతంగా నిర్వహించారని కాసాని దంపతులను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు రాష్ట్రాలలో టీడీపీకి భవిష్యత్తు ఉజల్వంగా ఉండాలని విజయం వైపు నడవాలని, తెలుగు ప్రజలందరికీ శుభం కలగాలని ఈ యాగం నిర్వహించినట్లు కాసాని తెలిపారు.













