హైదరాబాద్ లో కేంద్ర బృందం పర్యటన
హైదరాబాద్ లో భారీగా కురిసిన వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. కర్మాన్‌ఘాట్, మీర్‌పేట నాలాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఉదయ్‌నగర్, మల్రెడ్డి రంగారెడ్డి నగర్, తపోవన్ కాలనీలో 2 వేల ఇళ్లు ముంపునకు గురైనట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం సరూర్‌నగర్ చెరువును బృందం పరిశీలించింది. వరదల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలను పరిశీలించిన ప్రవీన్ వశిష్ట నేత్వత్వంలోని కేంద్ర బృందం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వరద నష్టానికి సం•ంధించిన నివేదిక ఇవ్వాలని కిషన్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టానికి సంబంధించి సమగ్ర రిపోర్టు ఇంకా అందలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమర్జెన్సీ రిలీఫ్ కింద స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రి కిషన్ రెడ్డి కోరారు.













