సీఎం కేసీఆర్ కు కేంద్రం ఆహ్వానం
సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్‌ను గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా రావాలని ఆహ్వానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ కార్యక్రమానికి వస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. ఏడాది పాటు రాష్ట్రమంతా తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని, ఇందులో కేంద్రం ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కర్ణాటక సీఎం బసరాజ్ బొమ్మైకి సైతం ఆహ్వానం పంపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విమోచనం తర్వాత కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని, అందుకే మూడు రాష్ట్రాలకు దీనితో సంబంధం ఉందని వివరించారు.













