మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం.. బీఆర్ఎస్ దే

తెలంగాణలోని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు. బీఆర్‌ఎస్ తిరిగి ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. మార్చి 28న జరిగిన ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 1,439 మంది ఓటర్లకు 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో లెక్కింపు ప్రారంభమైంది. పోలైన ఓట్లలో 21 చెల్లుబాటు కాలేదు. మొత్తం చెల్లిన 1,416 ఓట్లలో అభ్యర్థి విజయానికి 709 ఓట్లు కోటాగా నిర్ధారించారు. ఐదు టేబుళ్లపై కౌంటిగ్ ప్రారంభించారు. మొదటి ప్రాధాన్య ఓటులో నవీన్ కుమార్ రెడ్డికి 762 ఓట్లు, మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్‌కు ఒక ఓటు వచ్చింది. కోటా కంటే అధిక ఓట్లు బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి పోలవడంతో మొదటి ప్రాధాన్య ఓటులోనే ఆయన విజయం సాధించారు.