ఇప్పుడూ సీఎం కేసీఆర్ అదే చేస్తున్నారు : రాజాసింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్‌ను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అమలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. స్పీకర్‌తో భేటీ తర్వాత ఆయన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ మాటల్లో భయం కనిపించిందని అన్నారు. సీఎం కేసీఆర్ స్పీకర్‌ను ఎంత టార్చర్ పెడుతున్నారో అర్థం అవుతుందని అన్నారు. పోడియం దగ్గరకు రానీ ఈటల, రఘునందనరావులను సస్పెండ్ చేయటం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు గొడవ చేసినా సప్పెండ్ చేయలేదని తెలిపారు. నిజాంలు ఎంత దౌర్జన్యం చేశారో ఇప్పుడూ కేసీఆర్ అదే చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల రక్తం తాగుతోన్న కేసీఆర్‌ను దించుతామని హెచ్చరించారు. ఈటల వస్తే కేసీఆర్ చేసిన పాపాలు బయట పెడతారనే సభలోకి రాన్విడం లేదని అన్నారు.













