బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు… ఆ షోను బ్యాన్ చేయాలి
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిగ్‌బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలని, అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. షో ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రవిని ఎలిమినేట్ చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆయన అనుమానించారు. తెలంగాణ వ్యక్తిని పంపించి మరోసారి కొట్లాట పెట్టడానికి పథకం రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ షోలో హిందువుల మనోభావాలను కించపరిచారని, వ్యాపారం ముసుగులో ప్రాంతీయ అసమానతలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. కమీషన్లు తీసుకుని అధికారులు షోలకు అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. ఈ షో ద్వారా ఆంధ్ర, తెలంగాణకు కొట్లాట పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని చెప్పారు.













