ఈ ప్రాంతాభివృద్ధి కోసమే ఆయన రాజీనామా
మునుగోడు ఉప ఎన్నిక తీర్పు కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్బంగా నిర్వహించిన ర్యాలీలో సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని తెలిపాయి. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నా.. ఈ ప్రాంతాభివృద్ధి, ప్రజల కోసమే ఆయన రాజీనామా చేశారు అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచీ కాంట్రాక్టర్ అని ఎంతో మందికి ఆయన ఆర్థిక సాయం చేశారని తెలిపారు. కేసీఆర్‌కి సొంత విమానం కొనేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కుదవ పెట్టేందుకు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రామన్నగూడెం, శివన్నగూడెం, భూములను గుంజుకుని ఒక్కరికీ డబ్బు ఇవ్వలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతే గట్టుప్పల్ మండలం ఏర్పడిందన్నారు.













