తెలంగాణలో మరో ఉప ఎన్నిక…

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. గడిచిన రెండున్నరేళ్లలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, టీఆర్‍ఎస్ రెండు, బీజేపీ ఒక్క స్థానం గెలిచింది. హుజూర్‍నగర్ ఉప ఎన్నిక పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎంపీగా ఎన్నిక కావడంతో రాజీనామా చేసిన కారణంగా జరగ్గా, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు టీఆర్‍ఎస్ ఎమ్మెల్యేల మృతి కారణంగా జరిగాయి. ఇపుడు నాలుగో ఉప ఎన్నిక.. హుజూరాబాద్ స్థానానికి టీఆర్‍ఎస్ తరుపున గెలిచిన ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్న కారణంగా జరిగే అవకాశవం కనబడుతోంది.
నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో తెలిపారు. గన్‍పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించి అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‍రెడ్డిని కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఇక వారం రోజుల్లో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనది కమ్యూనిస్టు డీఎన్‍ఏ అయినా ప్రజల ఒత్తిడి మేరకు బీజేపీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వ్యవస్థతో ఒక వ్యక్తి పోటీపడగలడా? ఇప్పటికే హుజూరాబాద్‍లో టీఆర్‍ఎస్ రూ.50కోట్లు ఖర్చుయ పెట్టిందని ఆరోపించారు.