తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్ర సోనియా గాంధీతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గత కొంతకాలంగా ఆకుల పార్టీ కార్యక్రలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్న తరుణంలో ఆకుల రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.













