ఎవరి ఓట్లు ఉంచాలన్నది ఆ పార్టీ కార్యాలయం నుంచి లిస్ట్ : ప్రకాశ్‌రాజ్
ఓటర్ల జాబితాలో ఎవరి ఓట్లు ఉంచాలనేదానిపై బీజేపీ కార్యాలయం నుంచి లిస్ట్ వెళ్తోందని సినీనటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్ (sir) పై విమర్శలు చేశారు. బతికుండగానే ఓట్లు (Votes) తొలగించారని కొందరు చెబుతున్నారు. ఎవరి ఓట్లు ఉంచాలన్నది బీజేపీ కార్యాలయం (BJP office) నుంచి లిస్ట్ వెళ్తోంది. ఆ పార్టీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నాయి. అక్రమ చొరబాటుదారులుంటే ఇన్నేళ్లుగా ఏం చేశారు? కేంద్ర హోం శాఖ ఏం చర్యలు తీసుకుంది? అని ప్రశ్నించారు.








