వర్ధమాన టీవీ నటి స్వర్ణ వేములపల్లి బీజేపీలో చేరిక !
ఈటీవీ, జెమినీ టీవీ లలో అనేక సీరియల్స్‌లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన టీవీ నటి స్వర్ణలత వేములపల్లి నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారి సమక్షంలో బీజేపీలో చేరారు. కొంతకాలం ఐటీ రంగం లో, ఆ తర్వాత రాష్ట్ర హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేసిన విద్యావంతురాలైన స్వర్ణలత బీజేపీ లో చేరడం సంతోషమనీి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ రామా చంద్ర రావు ఆమెను అభినందించారు.
ఈ మధ్యనే జెమిని టీవీలో విజయవంతంగా ప్రసారమైన శివంగి సీరియల్లో శ్రీమతి స్వర్ణ ముఖ్యమైన శివంగి పాత్ర పోషించి, అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. శ్రీమతి స్వర్ణ మాట్లాడుతూ తనకు మొదటి నుంచి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు ఉందని, ప్రజా సేవా కార్యక్రమాలపై ఆసక్తి కూడా ఉందనీి తెలిపారు. ప్రస్తుతం భారతదేశం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పాలనలో ప్రగతి పథంలో అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో రాష్ట్రంలో శ్రీ రామచంద్ర రావు గారి నాయకత్వంలో బీజేపీ లో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు.








