బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC reservations) వ్యవహారంలో ఇటీవల రాష్ట్ర హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తాము కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పిటిషన్ (Petition) దాఖలు చేశారు.








