రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి : నేతలకు ఖర్గే నిర్దేశం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కలబురిగికి వెళుతూ శంషాబాద్ విమానాశ్రయంలో ఆగారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ (Venugopal) విమానాశ్రయంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు, పార్టీ స్థితిగతులపై ఖర్గే ఆరా తీశారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) రెండు స్థానాలను కైవసం చేసుకునేలా కృషి చేయాలని నేతలకు నిర్దేశించారు.








