ఆయనకు అసలైన వారసులు ప్రధాని మోదీనే : బండి సంజయ్
వారసత్వ రాజకీయాలకు మహాత్మా గాంధీ (Mahatma Gandhi) వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గాంధీచౌక్‌లో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. గతంలో 30 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress), ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలకు పరిమితమైంది. దేశ ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను కోరుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పేర్ల చివరన గాంధీ పేరు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వీళ్లది డూప్లికేట్ గాంధీ కుటుంబం (Gandhi family). కాంగ్రెస్ నాయకుల్లో మహాత్ముడి ఆశయాలు, భావజాలం లేదు. ఆయనకు అసలైన వారసులు ప్రధాని మోదీ (prime Minister Modi)నే అన్నారు.








