హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు – నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర
ఏపీ హైకోర్టు (High Court)లో సేవలందిస్తున్న ఐదుగురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ (Union Ministry of Law and Justice) నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ టీసీ ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము (Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ (Justice Lisa Gill) సోమవారం వీరితో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించనున్నారు.








