నోబెల్ పురస్కారానికి ప్రధాని మోదీ నామినెట్ !
2019 ఏడాదికి గాను ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసాయి సౌందర్‌రాజన్, ఆమె భర్త ప్రొఫెసర్ డాక్టర్ పి.సౌందర్ రాజన్ కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్‌కు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వారు కోరారు. నోబెల్‌కు పేర్లను నామినేట్ చేసేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో ప్రక్రియ ప్రారంభమవుతోంది. నామినేషన్ల ప్రక్రియ 2019, జనవరి 31న ముగుస్తుంది. యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, పార్లమెంట్ సభ్యులందరూ మోదీ పేరును నోబెల్ శాంతి బహమతి కోసం నామినేట్ చేయాలని సౌందర్ రాజన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల దేశంలోని పేదలందరికి మెరుగైన వైద్య అందుతుందని తెలిపారు.













