రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బావ, ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫేస్బుక్లో ఆయన పెట్టిన ఓ పోస్టింగ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రచార, సేవా కార్యక్రమాలు చేపట్టాను. కానీ, ప్రజలకు మరింత సేవ చేయాలన్న భావన ఉత్తరప్రదేశ్‌లో నాకు కలిగింది. అక్కడి ప్రజలు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలతో వారి జీవితాల్లో చిన్న మార్పునైనా తీసుకురావాలని అనిపించింది అంటూ ఫేస్బుక్లో వాద్రా పేర్కొన్నారు.













