మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గాంధీ మహాత్ముని గొప్పతనం తెలియచేయాలనే ఉద్దేశంతో వికీపీడియా తరహాలోనే గాంధీపీడియా ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గాంధీ జీవిత చరిత్ర గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలని కేంద్రం భావిస్తోంది. స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన కృషిని భారత సమాజం గుర్తుపెట్టుకోవడం కోసం గాంధీపీడియా ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ప్రతి ఏటా అక్టోబర్ 2న గాంధీజీ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈసారి జరుపుకోబోయే గాంధీ జయంతి 150వది కావడం ఒక ప్రత్యేకత. అందువల్ల గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీపీడియా ద్వారా మహాత్ముని విలువలు, ఆయన గొప్పతనంతో పాటు ఆయన చేసిన బోధనలను కూడా ప్రచారం చేయాలని నిర్ణయించినుట్ల తెలిపారు.













